calender_icon.png 26 October, 2024 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ గ్రౌండ్ ఖాళీ.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

12-07-2024 01:13:31 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారనని మాజీమంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఉండేదని దానం నాగేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులే లేవని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ బినామీలు రూ. వేల కోట్లు దోచుకున్నారని దానం వెల్లడించారు. దోచుకున్న బినామీల వివరాలు త్వరలో బయటపెడతానని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి మేకపోతు గాంభీర్యాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామంటూ మేకపోతు గాంభీర్యాలు చేశారంటూ మండిపడ్డారు.

త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందని దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని దానం పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదన్నారు. అపాయింట్ మెంట్ దొరికినా గంటల తరబడి నిలబెట్టేవారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం లేక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారని దానం స్పష్టం చేశారు.  విలువ లేనిచోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ విలువ ఉంటుందని దానం వెల్లడించారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని దానం తెలిపారు. ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఆయన పేర్కొన్నారు.