మహిళ కడుపులో కణితిని తొలగించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
రెండుగంటల పాటు శ్రమించి ఆపరేషన్
చర్ల, జూలై 14 (విజయక్రాంతి): ఒకవైపు ప్రజాప్రతినిధి, మరోవైపు వృత్తిరీత్యా వైద్యు డు.. ఇలా రెండు పదవులకు న్యాయం చేసి ప్రజల మన్ననలు పొందారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి ఆదివారం నిండు ప్రాణాలను కాపాడారు. ఆలుబాకకు చెందిన కుమారి తీవ్ర కడుపు నొప్పితో భాదపడుతూ భద్రాచలంలోని నిఖిత ఆసుపత్రిలో చేరింది. ఆమె కడుపులో 8కిలోల కణితి గడ్డ ఉందని వైద్యులు తేల్చారు. ఆమెకు వెంటనే ఆపరేషన్ చేస్తే చేయాలని నిర్ధారించారు. భద్రాచలం ఎమ్మెల్యే, దవాఖాన యజమాని తెల్లం వెంకట్రావు వైద్య బృందంతో సుమారు రెండుగంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి మహిళ కడుపులోని కణితిని తొలగించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఎమ్మెల్యేకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.