calender_icon.png 23 January, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంపతులకు ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే దంపతులు

22-01-2025 11:45:03 PM

పటాన్ చెరు: ఇటీవల తిరుపతి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పటాన్ చెరు పట్టణానికి చెందిన సందీప్ షా దంపతుల పార్టీవ దేహాలకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Goodem Mahipal Reddy) దంపతులు ఘన నివాళి అర్పించారు. బుధవారం ఉదయం పటాన్ చెరు పట్టణంలోని సీతారామయ్య కాలనీలోని సందీప్ షా కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మంగళవారం రాత్రి ప్రత్యేక వాహనంలో మృతదేహాలను పటాన్ చెరు పట్టణంలోని ఆయన నివాసానికి తీసుకొని వచ్చారు. సందీప్ షా మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో సందీప్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.