14-04-2025 08:05:12 PM
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్..
జై భీమ్ వారియర్స్ ను అభినందించిన ఎమ్మెల్యే..
వైరా (విజయక్రాంతి): నాకూ ఎమ్మెల్యే పదవి రావడానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన పెట్టిన బిక్ష వల్లే రాసిన రాజ్యాంగం ఫలితంగానే నాకు ఎమ్మెల్యే పదవికి దక్కిందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు శాంతినగర్ నందు జై భీమ్ వారియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొట్టమొదటిగా జై భీమ్ వారియర్స్ యూత్ ను అభినందించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దేశంలో అందరి బతుకులు మార్చిన మహానుభావుడు, అంబేద్కర్ అని, ఒక్కరి వాడు కాదని, అందరివాడిగా చూడాలని ప్రతి వాడవాడను ప్రతి సెంటర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అతని అడుగుజాడల్లో అందరూ ముందుకు నడవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే పదవి రావడానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అతను రాజ్యాంగం రాసుండక పోయి ఉంటే నా జీవితం ఎక్కడ ఉండేదో అని తను ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి విద్యావంతులుగా మేధావులుగా ముందుకు పోవాలని వారి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలోని తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫీడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్, కాంగ్రెస్ పార్టీ వైరా మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, గరిడేపల్లి కిషోర్, న్యూ డెమోక్రసీ నాయకులు కంకణాల అర్జున్ రావు, సిపిఐ మండల కార్యదర్శి యామాల గోపాలరావు, మాజీ ఎంపీపీ బొంతు సమత, ధర్నా రాశేఖర్, మోదుగు లక్ష్మయ్య పమ్మిఅర్జున్ రావు పమ్మి రాజు పమ్మి దాసు కరిశ రమేష్ కుక్కల నాగభూషణం కాకటి నరసింహారావు సైదులు పింగళి చలపతి చాట్ల దానేలు పీడియాల నరేష్ మోదుగ కృష్ణ కాకాటి వినోద్ కుమార్ దేవరపల్లి కాంతారావు నల్లగట్ల సాయి, కొమ్ము విజయ్ పమ్మి కిషోర్ మోదుగు సురేష్ కరిశ వాసు, పమ్మీ సతీష్, శాంతినగర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.