16-04-2025 12:46:05 AM
సిటీ స్టెల్ జిమ్ కోచ్
భద్రాచలం, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) ఖమ్మం జిల్లాలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాల స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలలో భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాకు మాస్టర్ టీం ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది. భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ లో కోచ్ జివి రామిరెడ్డి దగ్గర శిక్షణ తీసుకున్న 72 సంవత్సరాల డివి శంకర్రావు, గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని కూడా వైద్యుల పర్యవేక్షణ లో మాస్టర్ 4 విభాగంలో 83 కేటగిరీలో 60 కేజీల బరువెత్తి బంగారు పతకం సాధించిన డి. వి శంకర్రావును భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రత్యేకంగా అభినందించారు.
ఆయన మాట్లాడుతూ భద్రా చలం శాసనసభ పరిధిలోకి వచ్చే ప్రజలు అందరూ బైపాస్ సర్జరీ అయినా కానీ గోల్ మెడల్ కొట్టిన డీవీ శంకర్రావు ని ఆదర్శంగా తీసుకుని, తమకు అనారోగ్య సమస్యలు వున్నాయి అని చెప్పి వైద్యుల పర్యవేక్షణ లో రోజూ చేసే వ్యాయామానికి దూరంగా ఉండి మరింత అనారోగ్యం కు గురికావొద్దని తెలిపారు.
బైపాస్ చేయించుకున్న వ్యక్తితో గోల్ మెడల్ కొట్టించిన జిమ్ కోచ్ జివి రామిరెడ్డిని, అసోసియేషన్ సభ్యులను కూ డా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ జివి రామి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డా. శివరామకృష్ణ ప్రసాద్, ఇంటర్నేషనల్ పవర్ లిప్టర్ మో డెం వంశీ, తదితరులు పాల్గొన్నారు.