01-03-2025 12:29:41 AM
కరీంనగర్, ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి): ఇటీవల బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లోల్ కరీంనగర్ నగరానికి చెందిన షేక్ జియా హుస్సేన్ జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ గెల్చుకున్నారు. అలాగే ఆల్‌ఇండియా కరాటే పోటీల్లో నగరానికి చెందిన మహమ్మద్ సజ్జాద్ బ్లాక్ బెల్ట్ సాధించారు.
శుక్రవారం వారు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించి శాలువాతో సత్కరించారు. మరిన్ని విజయాలు సాధించి ఇటు రాష్ట్రానికి అటు దేశానికి మంచి పేరు తీసుకు రావాలని క్రీడాకారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, మాజీ కార్పొరేటర్లు వాల రమణారావు, దిండిగాల మహేష్, తోట రాములు, బోనాల శ్రీకాంత్, నాయకులు గందె మహేష్, కర్ర సూర్య శేఖర్, ఆసిమ్ తదితరులు పాల్గొన్నారు.