నిజామాబాద్ (విజయక్రాంతి): ఇందూర్ నగర మున్సిపల్ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ అధికారులతో సమీక్షా నిర్వహించరు. సోమవారం నిర్వహించిన ఈ సమీక్షలో నగరంలోనీ అహ్మద్ బజారులో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భారీ వ్యయంతో నిర్మించి నిరూపయోగంగా మారిందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అన్నారు. నెల రోజుల సమయంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించి ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని మున్సిపాల్ కమీషనర్ ను ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆదేశించారు.
నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఫుట్ ఫాత్ కబ్జాలు, అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని అందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగరం స్వచ్ భారత్ దిశగా క్లీన్ సిటీ చేసే బాధ్యత అందరు తీసుకోవాలని నిజామాబాదు కార్పొరేషన్ ను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టాలని అధికారులను ప్రజలను ఆయన కోరారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా పని చేయాలనీ మున్సిపల్ ఉద్యోగులకు ఎమ్మెల్యే సూచించారు. కార్పొరేటర్ల పదవి కాలం ముగుస్తుండటంతో కౌన్సిల్ సమావేశాలు త్వరలో నిర్వహించి డివిజన్ వారిగా ఉన్న రోడ్స్, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమీషనర్ రాజేందర్, అసిస్టెంట్ కమీషనర్ శంకర్, మురళి మనోహర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.