25-02-2025 05:43:26 PM
చిట్యాల: మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూదిపాల రాజిరెడ్డి ఇటీవలే ఆరోగ్యంతో మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట అప్పం కిషన్, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.