calender_icon.png 18 January, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత బజార్ శివాలయంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

26-08-2024 03:17:58 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ లోని పాతబజార్ శివాలయంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రోజున ఉదయం ఆయన దేవాలయానికి రావడంతో ఆలయ అధికారులు అర్చకులు, 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ  ఆకుల నర్మదా నర్సన్నతో కలిసి ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలోని పాతబజార్ శివాలయం అతి పురాతనమైన దేవాలయం అని స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని అన్నారు.

ఎంతోమంది రాజకీయ నాయకులు స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఉన్నత పదవులు అలంకరించరని అన్నారు.అందులో భాగంగానే నేడు శ్రావణ సోమవారం చివరి రోజు సందర్భంగా ప్రతేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యేను కార్పొరేటర్ దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత ఆకుల నర్మదా నర్సన్నతో పాటు ఆలయ ఈవో ఉడుత వెంకన్న, బిసి సంక్షేమ సంఘం నాయకులు ఆది మల్లేశం, బొల్లం లింగమూర్తి, చెల్లోజు రాజు, గుర్రం భాస్కర్ రెడ్డి, అంజి కుమార్, అనిల్, జశ్వంత్, తిరుపతి, రవి, రమేష్, తిరుపతి రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.