calender_icon.png 23 November, 2024 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

23-11-2024 03:04:37 PM

చెరువులోకి చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ 

సంగారెడ్డి, (విజయక్రాంతి): చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు అన్ని రకాల చేపపిల్లలను సకాలంలో అందజేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం సదాశివపేటలోని ఊబ చెరువులో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ , స్థానిక బిఆర్ఎస్ నేతలతో కలసి 28 వేల చేపపిల్లలని చెరువులోకి వదిలిపెట్టారు.

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడారు...

బీఆర్‌ఎస్‌ హయాంలో మత్స్యకారులకు 100 శాతం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయగా అప్పుడు నీలి విప్లవంగా చర్యలు చేపట్టి మత్స్యకారులకు చేతి నిండా పని కల్పించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అందులో 50 శాతం మాత్రమే చేప పిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఈ సంవత్సరం పది చెరువులకు మాత్రమే చేపపిల్లల పంపిణీకి 10 లక్షల విత్తనానికి విలువ రూ. 17 లక్షల విలువతో పంపిణీ గావిస్తున్నారు, 40 సొసైటీ లకు గాను 2216 మంది లబ్ది పొందుతున్నారు.

అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రస్తుతం కేటాయించిన దానికి కంటే రెట్టిపుగా ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారులకు అర్థికంగా ఇబ్బంది పడే విదంగా  చర్యలు ఉన్నాయి. వృత్తిపై ఆధారపడిన మత్స్యకారులకు ఉపాధి మీద దెబ్బకొట్టిన విధంగా ప్రస్తుత ప్రభుత్వం తీరు ఉంది.  కావున ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి మత్స్యకారుల సంక్షేమం దృష్టిలో ఉంచికొని తగు చర్యలు తీసుకోగలరని ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివరాజ్ పాటిల్,  ఫిషరీస్ ఏడీ, మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, కౌన్సిలర్లు సాతని శ్రీశైలం, ఇంద్రమోహన్, నాయకులు ముబీన్, నసిర్, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు చాపల హనుమంతు, నల్ల సుధాకర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.