calender_icon.png 19 February, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృక్షార్చన పేరుతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటుకోవాలి

15-02-2025 08:15:11 PM

హరితహారంతో తెలంగాణను ఆకుపచ్చగా మార్చిన ఘనత కేసీఆర్ ది

సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి,(విజయక్రాంతి): హరితహారం పేరుతో తెలంగాణను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR) ఆకుపచ్చగా చేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(MLA Chinta Prabhakar) తెలిపారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వృక్షార్చన పేరుతో మూడు మొక్కలను నాటారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం ఈనెల 17న ఉందని దీంతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వృక్షాలతోనే మానవ మనుగడ ఉందని ప్రతి ఒక్కరు చెట్లను పెంచి సంరక్షణ చేయాలన్నారు. ప్రస్తుతం అడవులు అంతరించిపోతున్నాయని ప్రతి ఒక్కరు అడవులను కాపాడవలసిన బాధ్యత ఉందన్నారు. మొక్కలు నాటడం తోని స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, నక్క నాగరాజు గౌడ్, చక్రపాణి, విటల్, నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, విష్ణు, జలంధర్, వీరన్న తదితరులు ఉన్నారు.