calender_icon.png 5 February, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలాం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

17-01-2025 04:52:21 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఉట్నూర్ మండలంలోని జెండాగూడా, మొర్రిపేట్, శివగూడా గ్రామాలలోని కోలాం, నాయక్ పోడు గిరిజనులకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) శుక్రవారం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ ప్రాంతంలోని నిరుపేదలకు సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నిరుపేద కోలాం, నాయకపోడు గిరిజనులకు తమవంతుగా దుప్పట్లను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంతరావు, ఆర్టీఎ జిల్లా సభ్యులు దూట రాజేశ్వర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఉట్నూర్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యుం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్, మాజీ సర్పంచ్లు భీమన్న, జగదీష్, కాంగ్రెస్ నాయకులు దాసండ్ల ప్రభాకర్, రాజేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.