మణుగూరు (విజయక్రాంతి): మణుగూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీడీవో శ్రీనివాసురావు, మున్సిపల్ అధికారులు, రెవిన్యూ అధికారులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్, మహిళా మండల అధ్యక్షురాలు సౌజన్, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.