కాప్రా (విజయక్రాంతి): కాప్రా సర్కిల్ పరిధిలోని సైనిక్ పూరి లోని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి నివాసంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగముగా సంబంధిత అధికారులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ప్రతి ఒక్కరు భాగస్వాములై తమ కుటుంబ వివరాలను తెలియజేయాలని ఆయన కోరారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అనంతరం ఎన్యుమరెటర్ లకి ఇంటింటి కుటుంబ వివరాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ లతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.