యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): చిన్న గౌరాయపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరయిపల్లి గ్రామంలో సోమవారం రోజు వాటర్ ప్లాంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బీర్ల ఐలయ్యకి వినతిపత్రం అందజేశారు. చిన్న గౌరాయపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.