calender_icon.png 12 January, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలతో అక్షరాలు దిద్ధించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

15-07-2024 04:47:58 PM

శెట్టిపాలెం : నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. పిల్లలకు,  గర్భిణీ మహిళలకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు సక్రమంగా వారికి అందుతున్నాయో లేదో అక్కడ ఉన్న ఆశ వర్క్స్ ను, గర్బిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారికి అక్షరాలు నేర్పించే మొదటి గురువు అంగన్వాడీ టీచర్స్ అన్నారు. కాబట్టి పిల్లలు బడి వాతావరణ అలవాటు అయ్యేలా వారిని చూసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిల్లలతో అక్షరాలు దిద్ధించారు.