గద్వాల, (వనపర్తి) (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సెకండ్ రైల్వే గేట్ సమీపంలో రెండో వార్డు లో చేపడుతున్న జంక్షన్ డెవలప్మెంట్ పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. గద్వాల పట్టణంలో ఎన్నడు ఎప్పుడు లేని విధంగా సెకండ్ రోల్ ఏ గేట్ సమీపంలో నూతనంగా జంక్షన్ డెవలప్మెంట్ ఏర్పాటు కావడం చాలా సంతోషం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గద్వాల ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు గద్వాలకు అడుగుపెట్టగానే ఆధునిక రకమైన ఎద్దులతో రైతు తో కలిగి ఉన్న చిత్రము తో స్వాగతం పలికే విధంగా ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో రైతు దేశానికి వెన్ను వెన్నుముక లాంటివాడని, గద్వాలకు ముఖ ద్వారంలో కొత్త తరుణంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . భవిష్యత్తులో గద్వాల పట్టణాన్ని మరింత అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్ది గద్వాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి, సాయి శ్యామ్ రెడ్డి, నరహరి శ్రీనివాసులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.