గద్వాల,(విజయక్రాంతి): గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వినతి పత్రాన్ని అందచేశారు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్(Agriculture University Guest House)లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Bandla Krishna Mohan Reddy), కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay)ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శ్రీ స్వామి వివేకానంద చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నవోదయ స్కూల్, సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయంతో పాటు గట్టులో ట్రామా కేవ్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు. అలాగే గద్వాల-రాయచూర్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని, ప్రజల రాకపోకలతో పాటు రవాణా సౌలభ్యం పెరుగుతుందని రాయచూర్ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ తో కలిసి ఎమ్మెల్యే కోరారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి స్థానికులంగా స్పందించి త్వరలో నే గద్వాల సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్ దౌలు, రాయచూర్ కౌన్సిలర్ తిమ్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు నాయకులు ఉరుకుందు, గోవిందు, కురుమన్న, ధర్మ నాయుడు , యుగంధర్ గౌడ్ కొత్త గణేష్, రాజు నాగార్జున, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు