calender_icon.png 18 October, 2024 | 12:03 AM

కాప్రా సర్కిల్ నాచారంలో ఎమ్మెల్యే అధికారులతో విస్తృత పర్యటన

17-10-2024 09:50:41 PM

కాప్రా,(విజయక్రాంతి): నాచారంలో కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో పటేల్ కుంట చెరువు వద్ద నిర్మించిన సివరేజ్ డైవర్షన్ పైప్లైన్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్  నాచారంలో  ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణతో కలిసి పటేల్ కుంట చెరువును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాచారం పటేల్ కుంట సివరాజ్ డైవర్షన్ పైప్ లైన్ ను వాడుకలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా  చెరువు చుట్టూ బండు నిర్మించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకొరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగించేందుకు FTC పనులను ప్రారంభించారు. ఎరుకల బస్తీలో చెరువుకు ఆనుకొని నిర్మించుకున్న ఇండ్లలోని వాసులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, గ్రేటర్ BRS నాయకులు సాయి జన్ శేకర్ ఇరిగేషన్ అధికారులు DE నరేందర్ AEE సుధీర్ లతో పాటు నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.