calender_icon.png 19 April, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఎసిఎస్ చైర్మన్ అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే

17-04-2025 08:25:29 PM

కొల్చారం (విజయక్రాంతి): మండల పరిధిలోని కొంగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ కృపాకర్ రెడ్డి అనారోగ్యంతో బుధవారం నాడు మృతి చెందాడు. కృపాకర్ రెడ్డి అంత్యక్రియలు గురువారం కొంగోడు గ్రామంలో నిర్వహించారు. ఆయన అంత్యక్రియలకు నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి హాజరై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ఇంద్రసేనారెడ్డి, వేమారెడ్డి, ముత్యం గారి సంతోష్ కుమార్, సత్యనారాయణ గౌడ్, తదితరులు ఉన్నారు.