10-03-2025 07:14:30 PM
రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోనీ తలమడ్ల గ్రామ ముదిరాజ్ సంఘం ఆహ్వానం మేరకు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన కార్యక్రమానికి సోమవారం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.