calender_icon.png 22 April, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గమ్మ తల్లి.. ప్రజలందరినీ చల్లగా చూడు..

22-04-2025 06:08:37 PM

ఎమ్మెల్యే మురళి నాయక్...

మహబూబాబాద్ (విజయక్రాంతి): దుర్గమ్మ తల్లి నీ చల్లని దీవెనలు మాపై ఎల్లకాలం ఉండాలి.. ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవించేలా చూడు తల్లి అంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Murali Naik Bhukya) వేడుకున్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిని బ్రహ్మంగారి గుడి తండాలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ డాక్టర్ అల్లం రామ, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి తదితరులున్నారు.