calender_icon.png 23 April, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే

10-04-2025 02:01:06 AM

కల్లూరు,ఏప్రిల్ 9 :-పెనుబల్లి మండలంలో ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో  బుధవారం జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా పెనుబల్లి హాస్పిటల్ లో ల్యాబ్,  ఎక్స్ రే రూమ్ ఒపీ, ఇన్ పేషంట్స్ ను పరిశీలించారు.పెనుబల్లి హాస్పిటల్ శానిటేషన్.పెనుబల్లి హాస్పిటల్ రికారడ్స్ పరిశీలించి, హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది తో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెనుబల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి కమిటీ సభ్యులు తో పలు సూచనలు, సలహాలు తెలుసుకున్నారు.

మెడికల్ ఆఫీసర్ కిరణ్ కుమార్  ప్రస్తుత హాస్పిటల్ వివరాలు కమిటీకి తెలియజేసి, పెనుబల్లి ఆసుపత్రి లో గల సమస్యలు గురించి ఎమ్మెల్యే కి, డెవలప్మెంట్ కమిటీ కీ తెలియజేసారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్ ప్రతాప్,మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బుక్కా కృష్ణవేణి,లైన్స్ క్లబ్ అధ్యక్షులు పొట్లపల్లి వెంకటేశ్వరరావు,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, హాస్పిటల్  డాక్టర్స్,సిబ్బంది మరియు సత్తుపల్లి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, పెనుబల్లి వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.