01-03-2025 01:38:04 AM
మంచిర్యాల, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో శుక్రవారం జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కూమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్న ఈ సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ లు పాల్గొన్నారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.