14-02-2025 01:59:31 AM
రాజాపూర్, ఫిబ్రవరి 13 : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ పరశురామ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకలు గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా శ్రీ పరశురామ పోచమ్మ తల్లి ఆలయాలు నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేస్తున్న మాజీ ఎంపీపీ నర్సింలు, మాజీ సర్పం బచ్చిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతల ఆశీర్వాద బలము చేతనే గ్రామాల్లోని ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు.
అలాగే దైవారాధన చేసే వారికి ఎటువంటి ఆర్థిక అనారోగ్య సమస్యలు రావని అన్నారు. ప్రతి ఒక్కరు దైవారాధన చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆయురారోగ్యాలతో జీవిస్తారని తెలిపారు. అలాగే సంతోష్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు ఆ సంఘం నేతలు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్, యాదయ్య ,గోవర్ధన్ రెడ్డి,నరహరి, శ్యాంసుందర్ రెడ్డి,బుగ్గయ్య, రమణ ,నజీర్ బేగ్, వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్, రమణ,ఇస్తారయ్య, తదితరులు పాల్గొన్నారు.