29-03-2025 12:57:57 AM
ఎల్బీనగర్, మార్చి 28 : హయత్ నగర్ డివిజన్ పరిధిలోని పాత గ్రామంలోని చిన్న మసీదులో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతాలకు అతీతంగా పండుగలు సామరస్యంగా నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశ్ ముదిరాజ్, భాస్కర్ సాగర్, అమీర్, నవీద్, హలీమ్, పలువురు నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.