calender_icon.png 23 March, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నాం: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

22-03-2025 09:41:25 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(MLA Arikepudi Gandhi) అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మొగులమ్మ బస్తీలో సుమారు 35 లక్షల రూపాయల వ్యాయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ... భూగర్భ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. పలు కాలనీల ప్రజల నుంచి వచ్చిన వినతులను, కార్పొరేటర్ల దృష్టికి వచ్చిన పరిగణలోకి తీసుకొని ఆయా సమస్యలపై ప్రత్యేక చొరవ చేపట్టి పనులను  ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

నిత్యం డ్రైనేజీ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రధమ ప్రాధాన్యతగా నిధులు కేటాయించి పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా డివిజన్ లలో ఎటువంటి చిన్న సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు నాగ ప్రియ, ఝాన్సీ స్థానిక నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, జిల్లా గణేష్, జోగిపేట భాస్కర్, కాశీనాథ్ యాదవ్, తదితరులు ఉన్నారు.