26-02-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనులకు గను రూ.1 కోటి 30 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని భాగ్య లక్ష్మీ నగర్ ఫేస్ 2, ఆలిండ్ కాలనీలలో రూ. 65 లక్షల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం రూ.1 కోటి 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీల వాసులకు ఉపశమనం కలిగించే మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా నిలబెడతానని తెలియచేసారు.
అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,కాలనీ వాసులు,అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు