శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నవోదయ కాలనీలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ విస్తృతంగా పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నాళ్లుగానో ఉన్న డ్రైనేజీ అవుట్ లెట్ సమస్య పై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం కాగానే నిధులు మంజూరు చేయించి త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ విశాలాక్షి, జలమండలి మేనేజర్ అభిషేక్ రెడ్డి నరేంద్ర రెడ్డి, నవోదయ కాలని అధ్యక్షులు వేంకటేశ్వర రావు, కాలని వాసులు, స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.