హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్పందించారు. మా ఇంటికి వచ్చి.. జెండా ఎగరేస్తామంటే ఖాళీగా ఉన్నామా? అని అరెకపూడి ప్రశ్నించారు. కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే స్వాగతించేవాడిని అని ఆయన పేర్కొన్నారు. నాతో పాటు ఉండే ఎమ్మెల్యేలు అడిగినా సమాధానం ఇచ్చేవాణ్ని అన్నారు. కౌశిక్ రెడ్డి నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా? అని ఫైర్ అయ్యారు. నన్ను గెలిపించకుంటే చచ్చిపోతా అని భయపెట్టిన వారికి మాట్లాడే అర్హత లేదని అరెకపూడి స్పష్టం చేశారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో నన్న 3 సార్లు ప్రజలు గెలిపించారని ఆయన వెల్లడించారు. నా నియోజకవర్గ ప్రజలకు నేను సమాధానం ఇస్తానని చెప్పారు. నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే తట్టుకునే థైర్యం ఆయనకు ఉందా? అని అరెకపూడి ప్రశ్నించారు.