హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అరెస్టు అయ్యారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత మధ్య అరెకపూడిని అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో అరెకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి అరెకపూడి గాంధీ, అనుచరులను తరలించారు. ఎమ్మెల్యే అరెకపూడిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు.