calender_icon.png 20 September, 2024 | 3:54 PM

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం

20-09-2024 01:59:06 PM

-ప్రతి మండలంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తాం.

-గత ప్రభుత్వం క్రీడా సామగ్రి కొనుగోలులో భారీగా అవినీతి కి పాల్పడింది.

-తిర్మలాపూర్ లో ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.

రాజాపూర్ విజయక్రాంతి: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే విశేషంగా కృషి చేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల కార్పొరేట్ బడులకు దీటుగా అభివృద్ధికి చేస్తుందని అన్నారు. విద్యార్థులను ఉత్తమ విద్య తోపాటు క్రీడా రంగంలో రాణించేందుకు విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పాలకులు క్రీడా సామాగ్రి కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.

గత ప్రభుత్వం సుమారు రూపాయలు 400 కోట్లు నిధులు వెచ్చించి 20వేల క్రికెట్ కిట్లను కొనుగోలు చేశారని ఆరోపించారు .ఏ మాత్రం నాణ్యతలేని నాసిరకం  క్రికెట్ కిట్స్ కొని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ప్రభుత్వం సహకారంతో రాజాపూర్ బాలానగర్ మేడ్చల్ ఊరుకొండ నవాబుపేట మండలాల్లో ఇండోర్ స్టేడియాలు నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు మూడు ఎకరాల స్థలం కావాలని ఆయా మండలాల తాసిల్దార్ కు చెప్పానని తెలిపారు. ప్రభుత్వ భూమి మూడు ఎకరాలు ఎక్కడ ఉన్నా ఇండోర్ స్టేడియం నిర్వహించేందుకు సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.

అలాగే ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు సమకూరుస్తామని తెలిపారు. తిరుమలాపూర్ పాఠశాలకు ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ,డిఇఓ రవీందర్, ఎంఈఓ వెంకటయ్య ,ఎంపీడీవో మచ్చేందర్, హెచ్ఎం సుధాకర్, నాయకులు కృష్ణయ్య ,శ్రీశైలం యాదవ్, యాదయ్య ,గోవర్ధన్ రెడ్డి ,వెంకటేష్, విక్రం రెడ్డి ,నరహరి ,శ్రీధర్ రెడ్డి, రమేష్, ఉపాధ్యాయులు ,యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు .