calender_icon.png 23 February, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

15-02-2025 01:11:23 PM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఆదిలాబాద్,(విజయక్రాంతి):  బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంజారా కులస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో నిరహించిన వేడుకలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా బంజారాల సాంప్రదాయం ప్రకారం పూజలు నిరహించి, భోగ్ సమర్పించి సేవాలాల్ జయంతి సందర్భంగా నూతన జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రజలందరికి సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బీఆర్‌ఎస్ నాయకులు, బంజారా సేవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.