calender_icon.png 12 February, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి మార్గంతోనే ప్రశాంతత లభ్యం

10-02-2025 01:54:16 PM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రశాంతత పొందాలంటే భక్తి మార్గం ఒక్కటే సరైన మార్గం అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. బోథ్ మండలం కుచులపూర్ గ్రామంలోని శబరిమాత ఆలయ మొదటి వార్షికోత్సవానికి సోమవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు నిర్వహించిన శబరిమాత పల్లకి శోభాయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని స్వయంగా పల్లకి మోస్తూ శబరి మాత సేవలో తరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు చేపట్టిన భజన కీర్తనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో బోథ్ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి(Boath Mandal Convener Narayana Reddy), మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రమోహన్ తో పాటు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.