ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని రాజుల తాండా గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ కలశ పూజ కార్యక్రమం ఘనంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బుద్దికొండ శ్రీ శభరి మాతా ఆలయ నుంచి రాజుల తాండా గ్రామం వరకు ఆలయ కలశ శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, బుద్ధి కొండ మాజీ సర్పంచ్, సొనల మాజీ సర్పంచ్ సదానందం, ప్రతాప్ సింగ్, సరించంద్, లిబాజీ తదితరులు పాల్గొన్నారు.