20-03-2025 12:38:27 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Boath MLA Anil Jadhav) అన్నారు. అదేవిధంగా శనగల కొనుగోలులో ఎకరాకు 6.29 క్వింటాల్లే కాకుండా ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారంఎమ్మెల్యే శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.