calender_icon.png 18 January, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టౌన్ ప్లానింగ్ ఏసీపీపై ఎమ్మెల్యే ఆగ్రహం

03-07-2024 12:10:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ అధికారులతో ఎమ్మె ల్యే మంగళవారం నిర్వహించిన సమీ క్షా సమావేశానికి టౌన్ ప్లానింగ్ ఏసీ పీ వెంకటరమణ గైర్హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత వచ్చా రు. ఆలస్యంగా వచ్చారేంటి అని అడిగినందుకు ‘మహా అయితే ఏం చేస్తారు.. బదిలీ చేస్తారు అంతే కదా’ అంటూ దురుసుగా మాట్లాడారు. అంతేకాకుండా ఎక్కడికి బదిలీ చేసి నా వెళ్తానంటూ మాట్లాడడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.