06-03-2025 08:13:43 PM
మందమర్రి (విజయక్రాంతి): కాజీపేట-బల్లార్షా వెళ్లే రైలును పునః ప్రారంబించడంతో హర్షం వ్యక్తం చేస్తూ రైలును పునః ప్రారంభం కావడానికి కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిల చిత్రపటాలకు గురువారం పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ... కరోనా సమయంలో కాజీపేట నుండి బళ్లార్షాకు వెళ్లే రైలును రద్దు చేయగా, గత బిఆర్ఎస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల కరోనా అనంతరం సైతం రైలు పునః ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో ప్రయాణికులు, వ్యాపారస్తులు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
సమస్యను పరిష్కారానికి పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిలు గత ఐదు నెలల నుండి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులతో పలు మార్లు సమావేశమై, రైలు పునః ప్రారంభించాలని కోరారు. స్పందించిన రైల్వే శాఖ కాజీపేట-బళ్లార్షా వెళ్లే రైలు పునః ప్రారంభించడంతో, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తురని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వల్లనే రైలు పునః ప్రారంభం సాధ్యమైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ ల హయాంలో పెద్దపల్లి పార్లమెంట్, చెన్నూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధితో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కార్యదర్శి బియ్యపు రవి కిరణ్, పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు రామసాని సురేందర్, పానుగంటి లక్ష్మణ్, ధనుక్ రాజేష్, చోటు, గణేష్, మహేష్, జీవన్, రాజేష్, చింటూ, శేఖర్, శ్రీనివాస్, సుజిత్, ఆశ్రాఫ్, సాత్విక్ లు పాల్గొన్నారు.