భీమదేవరపల్లి (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల భాగంగా డిసెంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించే 2 కె రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్యతో కలిసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధన్యతనిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలను అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ తొమ్మిది రోజులు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2కె రన్ ను ప్రారంభించడం ద్వారా క్రీడా రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌డిఓ అశోక్, డిడబ్లూఓ జయంతి క్రీడాకారులు పాల్గొన్నారు.