03-03-2025 07:02:03 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మారాలంటే ఇక మారేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) అన్నారు. ముఖ్యమంత్రి చేంజ్ అనే మిషన్ ను మీనాక్షి నటరాజన్(Telangana Affairs In-charge Meenakshi Natarajan) కు అప్పగించారని, సీఎంను మార్చేందుకు మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారని ఏలేటి చెప్పారు. డిసెంబర్ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమన్నారు.
ఆదివారం జరిగిన వనపర్తి ప్రజాపాలన ప్రగతిబాట సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకా పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం ముఖ్యమని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గాడి తప్పిందని, మంత్రుల తీరు ఎవరికి వారే యముణా తీరాన్నట్లుగా ఉందని మండిపడ్దారు. ఏ ఒక మంత్రి కూడా ముఖ్యమంత్రిని లెక్కచేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.