calender_icon.png 19 April, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

18-04-2025 08:08:20 PM

బైంసా,(విజయక్రాంతి): రైతులు జొన్నల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్,  బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ ముధోల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో వారు వేరువేరుగా జొన్నల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు.

అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఎఫ్ఎస్సీఎస్(FSCS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంబించారు.  కొనుగోలు కేంద్రంలో జొన్న పంటకు క్వింటా కనీస మద్దతు ధర రూ.3371  లభిస్తుందన్నారు.రైతులందరూ తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు,రెండు నియోజకవర్గాల పార్టీ నాయకులు సంబంధిత శాఖల అధికారులు అధికారులు పాల్గొన్నారు.