ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల,ఆగస్టు 25(విజయ క్రాంతి): ఆధ్యాత్మిక చింతనతోటే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం భరణి నక్షత్ర పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించిన యజ్ఞాదిహోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతోపాటు దేవ భక్తిని కలిగి ఉండాలని అన్నారు. ఆధ్యాత్మికత వల్లే ప్రశాంతత చేకూరుతుందని వివరించారు. అత్యంత పవిత్రమైన భరణి నక్షత్ర పర్వదినం సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, స్వామి వారి కరుణ కటాక్షాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.