calender_icon.png 17 March, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ

17-03-2025 02:14:38 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం  రేవంత్ రెడ్డి సర్కార్ ఐదు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా ప్రభుత్వ వీప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... బీసీల కల నెరవేరుతున్న సమయం ఇది అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు, సమగ్ర సర్వే వివరాల ఆధారంగా ఈ బిల్లు తెస్తున్నామని, సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.

స్వాతంత్యం వచ్చాక తొలిసారి కుల గణన తెలంగాణలో జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ బిల్లు,  దేవాదాయ చట్ట సవరణ బిల్లు, తెలుగు వర్సిటీ పేరు మారుస్తూ బిల్లు, పొట్టి శ్రీరాములు వర్సిటీ(Potti Sreeramulu Telugu University)ని సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీగా మారుస్తూ బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.