హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌గా ముకేష్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. ప్రసుత్తం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీడబ్ల్యూసీ చైర్మన్‌గా ఉన్న కుశ్విందర్ ఓహ్రా పదవీ విరమణ చేశాక.. గతేడాది అక్టోబర్ 1న కేంద్ర జల్‌శక్తి అదనపు కార్యదర్శి రమేశ్ కుమార్ వర్మను 3 నెలల పదవీ కాలం కోసం తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. వర్మ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఎంకే సిన్హాకు సీడబ్ల్యూసీ చైర్మన్‌గా పదోన్నతి కల్పించారు.