లక్షేట్టిపేట (విజయక్రాంతి): ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అండర్-19 ఎస్జిఎఫ్ స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ లో ఎంజేపీ లక్షేట్టిపేటకి చెందిన బి. విష్ణు హై జంప్ లో గుడిపేట ఎంజేపీ జె. దీపక్ క్రాస్ కంట్రీలో అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణం అని ప్రిన్సిపాల్ రోనాల్డ్ కిరణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మారుముల గ్రామాల నుండి వచ్చి జాతీయ స్థాయికి సెలెక్ట్ అవ్వడం మన ఆదిలాబాద్ కి ఎంతో చెప్పుకోదగ్గ విషయం అని ఎంజేపీ డిసిఓ శేరు శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీ లు నాంపల్లి, సురేష్, పిఈటీ రాజేష్ పాల్గొన్నారు.