calender_icon.png 19 March, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షకు ఎంజెఎప్ నాయకుల సంఘీభావం

18-03-2025 06:48:38 PM

మఠంపల్లి: సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికి దానిని అమలు చేయకుండా గ్రూప్ 1,2,3 ఫలితాలు వెల్లడించి ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారిచేయడం సుప్రీం కోర్టును దిక్కరించటమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ జిల్లా అధికార ప్రతినిధి దేవపంగు బాబు మాదిగ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు జరుగుతున్న రిలేనిరాహార దీక్షలు మంగళవారం తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. ఇట్టి దీక్షలకు ఎంజెఎప్ జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీలు సంఘీభావం తెలిపి దీక్షలో భాగస్వాములయ్యారు.

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఇరుగు ప్రభు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షుడు బయ్యారపు రవీంద్ర, ఎంజెఎప్ మండల అధ్యక్షులు పల్లె సుధాకర్, చిలక సైదులు, ఎంఎస్పి మండల అధ్యక్షులు కస్తాల వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ దైద రాయేలు, ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు కుర్రి శ్రీను, చిన్నపంగు నరేందర్, మంద రమేష్, ఎంఆర్పిఎస్ మఠంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కూరాకుల సైదుల తదితరులు పాల్గొన్నారు.