calender_icon.png 4 October, 2024 | 1:02 PM

కోరుట్లలో నకిలీ నోట్ల కలకలం

03-10-2024 12:08:17 AM

రూ.1.61 లక్షల నకిలీ నోట్లు సీజ్

ఐదుగురు నిందితుల అరెస్టు

కోరుట్ల, అక్టోబరు 2: కోరుట్ల పట్టణంలో నకిలీ నోట్లు చెలామణి కలకలం రేపుతున్న ది. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు తెలిపారు. కో రుట్ల పోలీస్ స్టేషన్‌లో బుధవారం వివవారలు వెల్లడించారు. పట్టణంలోని వేములవా డ రోడ్లు ఎస్‌బీఐ తాండ్రియాల బ్రాంచి ఎ దుట బంగారి సాయన్న అనే వ్యక్తి కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు.

గత 10 రోజు ల క్రితం ఓ వ్యక్తి వచ్చి కొబ్బరి బొండా కొని రూ.500 నోటు ఇచ్చాడు. సాయన్న రూ. 40 రూపాయలు తీసుకుని రూ.460 తిరిగి ఇచ్చాడు. ఇంటికి వెళ్లే క్రమంలో డబ్బులను లెక్కిస్తుండగా సదరు వ్యక్తి ఇచ్చిన రూ.500 నోటు నకిలీదిగా గుర్తించి పోలీసులకు ఫిర్యా దు చేశాడు. సాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టా రు.

నకిలీ నోట్లను సరఫరా చేయడానికి కో రుట్ల పట్టణంలోని తిలక్‌రోడ్‌లోని ఓ ఇంటి లో కొందరు వ్యక్తులు సమావేశమయ్యార న్న సమాచారం మేరకు ఈ నెల 1న సీఐ సు రేష్‌బాబు, ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో వెళ్లి ఐదుగురిని పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి ఓ వ్యక్తి రూ.2 లక్షల విలువైన రూ.500 నోట్లు పంపించగా..

వీరు ఆ నోట్లను పట్టణంలోని పలువురు చిరువ్యాపారుల వద్ద మారుస్తున్నారు. నకిలీ నోట్లను మరింతగా చెలామణి చేసేందుకు ఐదుగురు సమావేశం కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.61 లక్షల విలువైన రూ.500 నోట్లను, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.