calender_icon.png 16 April, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు పతకం సాధించిన మిట్టపల్లి రాజ్యలక్ష్మి..!

15-04-2025 10:54:31 AM

ప్రముఖుల నుండి వెల్లువెత్తుతున్న అభినందనలు..!

సన్మానించిన ఆర్యవైశ్య మండల పట్టణ కమిటీ..

విజయక్రాంతి, వైరా: ఇటీవల మైసూర్ దత్తపీఠం(Mysore Datta Peetham) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పారాయణం పోటీల్లో వైరాకు చెందిన శ్రీ కోదండ రామాలయం(Sri Kodanda Rama Temple) మాజీ చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు కోడలు, వైరా ఆర్యవైశ్య మండల అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్ సతీమణి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మండల పట్టణ కమిటీ ఆమెను ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం మండల పట్టణ అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్, ధారా వెంకటకృష్ణ, మండల పట్టణ కార్యదర్శులు కొల్లా రాంబాబు, జల్లా అవినాష్, కోశాధికారులు సముద్రాల మురళి కృష్ణ, చల్లా వెంకటరమణ మెంబర్షిప్ చైర్మన్  మిట్టపల్లి విజయకుమార్ కటకం శివకృష్ణలు ఆమెను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

అదేవిధంగా ఆర్యవైశ్య ప్రముఖులు వైరా వర్తక సంఘం అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు వనమా విశ్వేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... బంగారు పతకం సాధించడం పట్ల ఎంతో గర్వంగా ఉందని,  ఇలాంటి మరెన్నో పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి మరెన్నో పతకాలు సాధించి అర్య వైశ్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాలని  ఆయన ఆకాంక్షించారు. డాక్టర్ పెరుమాళ్ళ  కృష్ణమూర్తి, కొప్పురావూరి వెంకటేశ్వరరావు మిట్టపల్లి సత్యం బాబు, నూకల శ్రీనివాసరావు (వాసు), గజ్జల కృష్ణమూర్తి వజినే పల్లి చక్రవర్తి నూకల ప్రసాద్ కొణతాలపల్లి సుబ్బారావు వనమా చిన్ని తదితరు పెద్దలు ఆమెకు అభినందనలు తెలిపారు