న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరడంలో విఫలమైన భారత జట్టుపై మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లుగా జట్టులో పెద్దగా మార్పు కనిపించలేదని అభిప్రాయపడింది. విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న హర్మన్‌ప్రీత్ ఐసీసీ టోర్నీల్లో తొలిసారి జట్టును సెమీస్ చేర్చడంలో విఫలం కావడం బాధాకరమని తెలిపింది. మిథాలీ మాట్లాడుతూ.. ‘ఆసీస్‌తో మ్యాచ్‌లో మనకు గెలిచే అవకాశం ఉంది.
ఓ దశలో గెలిచేలా కనిపించారు. కానీ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. గడిచిన రెండు, మూడేళ్లలో చాలా జట్లు రాటుదేలాయి. భారత్ మాత్రం ఆ వేగాన్ని అందుకోలేకపోయింది. పొట్టి ఫార్మాట్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడంలో భారత్ విఫలమైంది. టీ20 ప్రపంచకప్‌లో పాక్, లంకపై విజయాలు సాధించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఓటమి హర్మన్ కెప్టెన్సీపై ప్రభావం చూపనుంది. ’ అని పేర్కొంది.