13-03-2025 01:05:49 AM
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): ఇంటర్ ప్రశ్నపత్రాల్లో ప్రతిరో జు తప్పులు దొర్లుతుండటంతో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురవుతు న్నారు. ఈనెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా, మొదటిరోజే ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో తప్పు దొర్లింది. బుధవారం జరిగిన బోటనీ పేపర్‌లో 5,7 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి.
అలా గే మ్యాథ్స్ పేపర్‌లో ఓ ప్రశ్న తప్పుగా వచ్చింది. ప్రశ్నప్రతాల్లో రోజూ తప్పులు దొర్లుతుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల కారణంగా ప్రశ్న అర్థం కాకపోవడంతో జవాబులు రాయకుండా వదిలేస్తే మార్కులు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పులకు చోటు లేకుం డా ప్రశ్నపత్రాలను రూపొందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం జరిగిన సెకండియర్ మ్యాథమెటిక్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్-2 పరీక్షలకు 4,54,031 మంది హాజరుకాగా, 13,258 మంది గైర్హాజ రయ్యారు. 3 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఇంటర్ పరీక్షలు ఈ నెల 25 వరకు జరగనున్నాయి.